Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
స్వయంఉపాధిపై యువత దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్‌గౌడ్ అన్నారు.మండలంలోని చీకటిమామిడి గ్రామంలో గుగులోత్ నర్సింహానాయక్,దీరావత్ లక్ష్మణ్‌నాయక్ లు నూతనంగా ఏర్పాటు చేసిన హార్డ్ వేర్ ఎలక్ట్రికల్ దుకాణాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.సరసమైన ధరలకు వస్తువులు అందించి వ్యాపారభివృద్ధిని మరింత పెంపొందించుకోవాలని కోరారు.ముఖ్యంగా యువత స్వతహాగా వ్యాపారం, స్వయం ఉపాధి కల్పించుకోవడం వలన అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జగ్గర్ల ఆనంద్ గౌడ్,బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వేముల నరేష్,తుర్కపల్లి మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్,తిమ్మాపూర్ ఎంపీటీసీ శ్రీహరినాయక్, నాయకులు భూక్యా రవీందర్‌నాయక్,రంగా రామాగౌడ్,ఎల్లబోయిన రవిశంకర్, చీర గణేష్, మేకలపాండు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.