Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఇండ్లు లేని పేదలందరికీ 120 గజాల స్థలం కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 లక్షలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ కోరారు.ఆదివారం మండలంలోని పటేల్‌గూడెం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మండలంలోని చాలామంది పేదలకు ఇండ్లు లేవన్నారు.అదేవిధంగా పెన్షన్ లేనివారు, ఇండ్లు లేని వారు,రేషన్‌కార్డు లేని వారు అధికసంఖ్యలో ఉన్నారన్నారు.ప్రభుత్వం వీరికి వెంటనే ఇండ్ల వసతులు కల్పించాలని కోరారు.దేశంలో పేదల సంఖ్య పెరుగుతున్నది కుబేరులు మరింత ధనవంతులుగా అంబానీ,ఆదాని దేశంలోనే నెంబర్‌వన్‌గా తయారవుతున్నారు.నిరుపేదల పేదలుగా మారుతున్నారు గతంలో ఉన్నట్టు పేదల బతుకులు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు పొన్నంలక్ష్మయ్య, కొయ్య రమ్య, గ్యార విజయ, సహాయకార్యదర్శి బండ శ్రీనివాస్, సరిత,కవిత, భిక్షపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.