Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడ్డగూడూర్
ఆయిల్ ఫామ్ సాగు దిగుబడిలో అధిక లాభాలు వస్తాయని తుంగతుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాలువ గ్రామంలో సింగిల్‌విండో చైర్మెన్ గ్రామ రైతు పొన్నాల వెంకటేశ్వర్లు 14 ఎకరాల భూ విస్తీర్ణ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలను వారు నాటి మాట్లాడారు.అనంతరం ఆయిల్ఫామ్ సాగుపై రైతులకు అవగాహనా సదస్సును ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ సాగవలన రైతులకు కలిగే లాభనష్టాలను వివరించారు.ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ మూస పద్ధతిలో ఒకే పంటలను పండించకుండా రైతులు ఆర్థికంగా అభివద్ధి చెందడానికి తోడ్పడే ఆయిల్ఫామ్ లాంటి పంట వైపు మళ్లాలన్నారు.మిగతా పంటలతో పోల్చుకుంటే ఆయిల్ఫామ్ సాగులో రసాయన మందుల వాడకం తక్కువ, కూలీల అవసరం ఉండదన్నారు.అడవి పందుల బెడద కూడా ఉండదన్నారు.అలాగే శ్రమ తక్కువగా ఉండి అధిక ఆదాయం వస్తుందన్నారు.మొక్కలు నాటిన నాలుగేండ్ల వరకు అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పండించిన పంట అమ్మకం విషయం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు .ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు.అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరిన వారిని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ ఎండి సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తీపిరెడ్డి మెగారెడ్డి, మోత్కూర్ సింగిల్‌విండో చైర్మెన్ కంచర్ల అశోక్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మెన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య, వైస్‌ఎంపీపీ దైద పురుషోత్తంరెడ్డి, ఎంపీడీఓ చంద్రమౌళి, బీఆర్ఎస్ అడ్డగూడూరు, మోత్కూర్ మండలాల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, పొన్నెబోయిన రమేష్, మండల కో ఆప్షన్ సభ్యులు,మాదాను ఆంథోనీ, గ్రామ సర్పంచ్ నారగోని అంజయ్యగౌడ్, ఎంపీటీసీ చిగుళ్ల ఉపేంద్ర రమేష్ , హార్టికల్చర్ అధికారులు, ఆయిల్‌ఫెడ్ సిబ్బంది, వ్యవసాయ అధికారులు , వివిధ గ్రామాల సర్పంచులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.