Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
నిజం నిప్పులాంటిదని, ఎవరిని దుష్ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ. జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నకిరేకల్ మెయిన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఆరో వార్డు కౌన్సిలర్ మట్టిపల్లి కవిత వీరందర్తో పాటు మరో 300 మంది యువకులు టీిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన వారందరికీ సమ ప్రాధాన్యతను ఇస్తామన్నారు. దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్ఎస్ ఉద్భవించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా ఆచరిస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ చేతగానితనం వల్లే దేశంలో చీకటి అలుముకుందని విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నినాదమన్నారు. ఏ మంత్రిని కలిసిన అభివృద్ధి కోసం నిధులు ఇవ్వండి అంటూ అడిగే నిస్వార్ధపరుడు చిరుమర్తి అని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముసుగు దొంగలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, అలాంటి వారిని పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వదన్నారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా నకిరేకల్ పట్టణాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్‌గౌడ్, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, ఎల్లపురెడ్డి సైదారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సోమయాదగిరి, నాయకులు పెండెం సదానందం పాల్గొన్నారు.