Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట/నల్లగొండ
ప్రపంచ విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా భారత్ పర్యటనలో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన క్యూబా సంఘీభావ సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ ఆమెను కలిసి పోచంపల్లి చేనేత చీరను ఆమెకు బహూకరించారు.ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడుతూ అలైదా గువేరా తన తండ్రి చేగువేరా స్ఫూర్తితో సేవ కార్యక్రమాలకు అంకితమై పనిచేస్తుందని అన్నారు. తన తండ్రి అయిన చేగువేరా లాగే నిత్యం ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ తండ్రికి తగ్గ సిసలైన వారసురాలుగా పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. కరోనా కష్టకాలంలో అనేక దేశాలలో వైద్య సేవలు అందించారని తెలిపారు.క్యూబా దేశంలో వికలాంగుల పిల్లల కోసం రెండు ఆశ్రమాలు, శరణార్థి పిల్లల కోసం మరో రెండు ఆశ్రమాలు నడుపుతూ అనేకమందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.తూర్పు క్యూబాలోని రియో కౌటో చుట్టుపక్కల వరదలు ముంచినప్పుడు ఆ ప్రాంతంలో వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు.2008లో తుఫాన్ల వల్ల నాశనమైన యూత్ దీపంలో సహాయకచర్యలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నేటి యువత ముఖ్యంగా మహిళలు అలైదా గువేరాను ఆదర్శంగా తీసుకొని పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు.