Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- బీఆర్ఎస్లో చేరిన 12 వార్డ్ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్
నవతెలంగాణ-సూర్యాపేట
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.పిల్లలమర్రి 12 వార్డ్ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆదివారం పిల్లలమర్రిలో ఏర్పాటు చేసిన కార్య్రమంలో మంత్రి మాట్లాడారు.అభివృద్ధి ఎలా ఉంటదో తెలియని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.దేశంలో ఎక్కడా కూడా తెలంగాణ తరహా అభివద్ధి జరగలేదన్నారు.మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో సైతం సాగు కోసం ఇచ్చేది 6 గంటల విద్యుత్ మాత్రమేనన్నారు.అక్కడి ప్రజలు దాహం కేకలతో అల్లాడి పోతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్‌ను మించిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని పేర్కొన్నారు.ఆయన పాలన కోసం యావత్ భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.కేసీఆర్ లాంటి పాలన పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే బీజేపీ పాలనలో దేశంలోని 35 శాతం మంది ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారన్నారు.మోడీ పాలన కేవలం ఒక్కరిద్దరు సంపన్నులను మరింత సంపన్నులను చేయడం కోసమే సాగుతుందని ఆరోపించారు.తమ ప్రాంత అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరిన పిల్లమర్రి కౌన్సిలర్ శ్రీనివాస్, ఇతర పార్టీల కార్యకర్తలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలమర్రికి మంత్రి వరాలు.....
గత ప్రభుత్వ హయాంలో పంచాయతీగా ఉన్న పిల్లలమర్రిలో 2 కోట్ల రూపాయల నిధులతో సీసీ రహదారులను నిర్మించామని పేర్కొన్నారు.2014 -18 లో సంక్షేమ పథకాల కోసం 22 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు.అభివృద్ధి కోసం కౌన్సిలర్ శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా అంబెడ్కర్ నగర్ లో బ్రిడ్జి, అలుగు నీరు బయటకు వెళ్ళే విధంగా మరో బ్రిడ్జి నిర్మాణం కోసం త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ యువ నాయకులు రాపర్తి మహేష్ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్చైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మెన్‌్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.పార్టీలో చేరిన వారిలో మాదగోని కేశవులు, చెరుకుపల్లి బంగారి మల్లయ్య, సయ్యద్ రసూల్, బంగారి నరేష్, సట్టు వెంకన్న, చెరుకుపల్లి హరిబాబు, సట్టు కపిల్, కోనేటి కృష్ణ, మేకమ్ వెంకన్న, కామిశెట్టి వంశీ, కొండ మధు, గాజుల సైదులు, కొండ సాయి, గాజుల నాగరాజు, అర్వపల్లి, జనార్దన్, ముత్తిలింగయ్య, ఆలేటి సాంబయ్య, సుంకరి శ్రీను, శ్రీకాంత్ తో పాటు 200 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.