Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు
నవతెలంగాణ-నేరేడుచర్ల
రాజకీయాల్లో ఆదర్శమూర్తిగా, నిస్వార్థ సేవకుడిగా రాజకీయ సేవలందించిన వ్యక్తి ఆరిబండి లక్ష్మీనారాయణ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కరరావు అన్నారు.నేరేడుచర్లలో ఒక ప్రయివేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో నేరేడుచర్లలో ఆరిబండి మనువడు మాజీ సర్పంచ్ న్యాయవాది సుంకర క్రాంతికుమార్ అందించిన అరిబండి జీవితచరిత్ర పుస్తకాన్ని అందుకున్న అనంతరం మాట్లాడారు.అలాంటి ప్రజానాయకులు ఇప్పుడు అరుదుగా కనిపిస్తారని కొనియాడారు.ఆయన వెంట కలిసొచ్చిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే ఆగ్రోస్ ఇండిస్టీస్ కార్పొరేషన్చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడారు.తనకు అరిబండితో అనుబంధం ఉందని, నిస్వార్థ సేవకుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగండ్ల శ్రీధర్, కొనటంఆదిరెడ్డి, అనంత శ్రీనివాస్‌గౌడ్, కుంకుతిరుపతయ్య, పెద్దపొంగు ఎలీషా, నందిపాటిహిందూజా, ఆకుల జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.