Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
- ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచాలి
- అవుట్సోర్సింగ్ కార్మికురాలు ఉషా కుటుంబానికి న్యాయం చేయాలి
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆస్పత్రి స్థాయిని వంద పడకులకు పెంచే వరకు తాము ఉద్యమిస్తామని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర్రావు హెచ్చరించారు.సోమవారం పట్టణంలోని పబ్లిక్క్లబ్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరావు, ఎమ్మెస్ కళాశాల అధినేత, కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, బీఎస్పీ రాష్ట్ర ఈసీ సభ్యులు పిల్లుట్ల శ్రీనివాస్, ఎంఎస్పీ డివిజన్ కన్వీనర్ ఏపూరి రాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ సభ్యుడు ఉదయగిరి డిమాండ్ చేశారు. పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని 100 పడకలకు మార్చాల్సింది పోయి 15 పడకలకు తగ్గించడం బాధాకరమన్నారు.అనేక ఏండ్లుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులను అర్ధాంతరంగా తీసివేయడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఉష అనే కార్మికురాలు ఉపాధి పోయిందని బాధతో ఆత్మాహత్యాయత్నం చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదన్నారు.ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పి నేటి వరకు చేయకపోగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం పట్ల వారు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.ప్రభుత్వ వెంటనే ఆస్పత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేంతవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈసమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జె.నర్సింహారావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, గంటా నాగరాజు సామాజిక కార్యకర్తలు పొడుగు హుస్సేన్, కుదరవెల్లి బసవయ్య, షేక్మునీర్, ఎల్హెచ్పీహెచ్ జిల్లా అధ్యక్షులు బానోతు బాబునాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి కోటేశ్వరరావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుకూరి ఉపేందర్, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కందులవీరబాబు, పాతకోట్ల శ్రీనివాస్, పిడతల శంకర్, పాలెరాము, చింతల రమేష్, తదితరులు పాల్గొన్నారు.