Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండల పరిధిలోని పొట్లపహాడ్‌కు చెందిన బందు సైదులు గుండెపోటుతో ఆదివారం మరణించగా విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి సోమవారం గ్రామానికి చేరుకుని సైదులు మృతదేహానికి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.అంతకుముందు అనంతారం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ కాలువలో పడి మృతి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ మామిడి కల్యాణచక్రవర్తి అనారోగ్యంతో మృతి చెందిన బైరెడ్డి మట్టారెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి కుటుంబీకులను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్,డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, ఎంపీపీ నెమ్మాదిభిక్షం, జెడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరియుగంధర్, ఉపాధ్యక్షులు కొండ జానకిరాములుగౌడ్, జిల్లా నాయకుడు సముద్రాల రాంబాబు, సర్పంచ్‌లు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెన్ను శ్రీనివాసరెడ్డి, రామినేని పుష్పవతికృష్ణయ్య, రైసస అధ్యక్షులు పొదిల నాగార్జున తదితరులు ఉన్నారు.