Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ఈనెల 30,31వ తేదీల్లో ఢిల్లీలో జరిగే సెమినార్ను జయప్రదం చేయాలని యువజన సమితి జిల్లా అధ్యక్షుడు మల్లయ్యయాదవ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ అన్నారు.సోమవారం ఆయన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, మన ఉద్యోగాలు మనకే దక్కుతాయని అనుకున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో పూర్తి చేయ లేదన్నారు.రాష్ట్రంలో అప్పులుమాత్రం రూ.3లక్షలకోట్లకు పైచిలుకు పెరిగా యన్నారు. అయినప్పటికీ ఆశించిన అభివృద్ధి లేదన్నారు. అప్పులు చేయడం అవినీతికి పాల్పడడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.కృష్ణాజలాల్లో వాటా ఎంతనో నేటికీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోయిందన్నారు.ఈ కార్యక్రమంలో సురేష్, చందు, కిరణ్ పాల్గొన్నారు.