Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద విడుదలైన రూ.7 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణపనులకు సర్పంచ్ పల్లెపంగు నాగరాజు చేతులమీదుగా సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో కల్లూరు పాఠశాలను, గ్రామపంచాయతీనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు.ఇప్పటివరకు పాఠశాలను సుమారు రూ.35 లక్షలతో అభివృద్ధి చేశామని, మున్ముందు కూడా చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ చలసాని మాధవరావు, కల్లూరు ఎంపీటీసీ నందిపాటి నాగవేణి గుర్వయ్య,ఉపసర్పంచ్ సిరికొండ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కోనపద్మ,స్కూల్ చైర్మెన్ అనంతుసైదులు,హెడ్మాస్టర్ బియ్యాలవెంకటనర్సయ్య,చెరువు చైర్మెన్ బుడిగె రంగయ్య,వార్డుసభ్యులు గజగంటి సంతోష, రెడపంగుఉపేంద్ర, కోదాటి కృష్ణయ్య, సిరికొండ సత్యం, యడవెల్లి సరిత, అంగన్వాడీ టీచర్లు భూదేవి,గజగంటి ప్రవీణ్,పల్లెపంగు పెద్దసైదులు,పల్లెపంగు బడిసైదులు,బుడిగెసోమయ్య,లకుమల్ల నాగరాజు, పర్వతం చంద్రగిరి,పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.