Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
తెలంగాణ పల్లెల లో కనపడుతున్న అభివృద్ది,25 యేళ్ళుగా పాలిస్తున్న మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో లేదని,మన పల్లెలలో ఉన్న వైకుంఠదామాలు, పల్లె ప్రకృతివనాలు, గుజరాత్ పల్లెలలో కనబడవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్, కేసారం గ్రామాలలో అభివద్ధి పనుల ప్రారంభం,పండుగ వాతావరణం నెలకొందన్నారు.ఆదివారం సాయంత్రం మొదటగా కాసరాబాద్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో గ్రంథాలయ భవనం,ఓపెన్‌జిమ్‌లను ప్రారంభించిన మంత్రి, కేసారం గ్రామంలో రూ.1.25 కోట్లతో నిర్మించిన అంగన్ వాడీ భవనం, గ్రామ పంచాయితీ భవనం, ఓపెన్ జిమ్‌లతో పాటు పల్లె దవాఖానలను, రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీహాల్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పల్లెలలో కనపడుతున్న అభివృద్ధి 25 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో లేదన్నారు.గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాల ప్రారంభించడం సంతోషం గా ఉందన్నారు .పెన్షన్ లు, సంక్షేమ పథకాల కోసం ఒక్కో గ్రామానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు సంవత్సరానికి సుమారు 5 కోట్లకుపై మాటే అన్నారు.దేశంలో తెలంగాణ మినహా, 35 శాతం మంది ప్రజలు ఒక్క పూటనే తింటూ, మిగతా పూట పస్తులుంటున్నారన్నారు.ఎవరి పాలనలో మనకు లాభం జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.40 ఏండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పాలకులతో ఒరిగిందేమీలేదన్నారు.8 ఏండ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేేసీఆర్దేనని కొనియాడారు.ప్రజలకు ఏం చేశామో..ఏం చేస్తామో చెప్పే దమ్ముధైర్యం కాంగ్రెస్,బీజేపీలకు లేదన్నారు.గ్రామాల్లో ఇంకా ఆ జెండాలు పట్టుకుని తిరుగుతున్న నాయకులను ప్రజలే ప్రశ్నించాలన్నారు.కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం,మోసపోతే దగాపడ్తామన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ రవీందర్‌రెడ్డి,జెడ్పీటీసీ జీడిభిక్షం, జెడ్పీవైస్చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, రమణారెడ్డి, మండలఅధ్యక్షులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, నాగరాజు, గన్నారెడ్డి, ఆయా గ్రామాలసర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.