Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రజావాణిలో ప్రజల నుండి అందిన పిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించ వద్దని అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి అందిన పిర్యాదులు పరిశీలించి బాధితులకు తగు న్యాయం చేయాలని సూచించారు.
వయో వృద్ధులను ఆదరించాలి..
ప్రజావాణిలో రొండి అంజయ్య, లింగమ్మ వృద్ద దంపతులు తమ పిల్లలు తమను పట్టించు కోవడం లేదని, ఆలనా పాలనా చూడడం లేదని వయో వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం న్యాయం చేయాలని, తమ కూతురు వెంకట రమణిపై అర్డీఓకు పిర్యాదు చేశారు. వయో వృద్ధుల సంక్షేమ చట్టం ననుసరించి ఆర్డీఓ విచారించి శాలి గౌరారం మండలం గురజాల ఉన్నత పాఠశాలలో జీవ శాస్త్రం స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వృద్ద దంపతుల కూతురు బొల్లం వెంకట రమణని ప్రతి నెల పది వెలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో ఆదేశాలు అనుసరించి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుకు ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం నవంబర్ 18 న ఇచ్చిన ఆదేశాలు పట్టించు కొక పోవడంతో వృద్ద దంపతులు ప్రజావాణిలో పిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్ వెంటనే స్పందించి పాఠశాల హెడ్ మాస్టర్‌తో మాట్లాడి వెంటనే 3 నెలలు నెలకు 10 వేల చొప్పున వెంటనే చెల్లించాలని, ఆర్డీఓ కోర్టు ద్వారా జారీ చేసిన ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించారు.