Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు ఆపకుండా దురుసుగా వెళ్లిన డ్రైవరు
- జువ్విగూడెం గ్రామంలో విద్యార్థులు రాస్తారోకో ఆందోళన
నవతెలంగాణ-నార్కట్పల్లి
మోత్కూర్ నుండి నల్లగొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎక్కబోయి విద్యార్థి కిందపడి తీవ గాయాలైన సంఘటన సోమవారం మండల పరిధిలోని జువ్విగూడెంలో చోటుచేసుకుంది. విద్యార్థులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో బస్సులను కుదించి నల్లగొండ నుంచి మోత్కూరుకు నల్లగొండ డిపో బస్సులు నడిపిస్తున్నారు గతంలో నార్కట్పల్ల్లి డిపో నుంచి ప్రతి అరగంటకు ఒకసారి ముఖ్యంగా విద్యార్థుల పాఠశాల కళాశాల సమయంలో విద్యార్థులకు అనుగుణంగా బస్సు నడిపేవారు. నల్గొండ డిపో నుంచి బస్సులు తిరుగుతున్న కాలంలో డ్రైవర్లకు నల్లగొండ డిపో అధికారులకు అవగాహన లేకపోవడంతో బస్సుల సంఖ్యను తగ్గించి గ్రామాలలో బస్సులను ఆపకుండా వేగంగా దురుసుగా వెళ్లడంతో విద్యార్థి తరగతులు మిస్ అవుతాయనే ఉద్దేశంతో నడుస్తున్న బస్సు ఎక్కేందుకు ప్రయత్నించగా బస్సు ఢకొీని కిందపడిపోయాడు. దీంతో చేతికి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
జువ్విగూడెం గ్రామంలో విద్యార్థులు రాస్తారోకో, ఆందోళన
నార్కట్పల్లి మోత్కూర్ రహదారిపై బస్సులను ఆపకుండా వెళ్లడానికి నిరసిస్తూ విద్యార్థులు సోమవారం జువ్విగూడెం గ్రామంలో బస్సులను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించి ఆందోళనకు దిగారు. గాయపడిన విద్యార్థికి వైద్యం చేయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.