Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్పల్లి
తెలంగాణా రాష్ట్రంలాగే దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఅర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని గోపలాయిపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు పథకం ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. కేసీఆర్ సరికొత్త ఆలోచన విధానాలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు.. కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గోపలాయిపాల్లి గ్రామాభివృద్ధికి ఇప్పటికే 50 లక్షలు కేటాయించామని, గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షలు మంజూరు చేశాం.. అని పేర్కొన్నారు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తాం. గోపలాయిపల్లి గ్రామంలో మట్టిరొడ్డు లేకుండా చేసే భాధ్యత తనదే అని ప్రకటించారు. అదేవిధంగా ముదిరాజ్ సంఘ భవనం ఏర్పాటుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మురళీమోహన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెగోని యాదగిరి గౌడ్, ఆ గ్రామ సర్పంచ్ గోసుల భద్రాచలం, వైద్యాధికారి సారా సుల్తానా, చెరువు గట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు, ఉప సర్పంచ్ యాట సైదులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్షేత్రస్థాయి అధికారి బడుగు శ్రీరాములు వార్డు సభ్యులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.