Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి
నవతెలంగాణ-హలియా
పంగవానికుంటలో రోడ్డుని ఆక్రమణ చేసి అడ్డుగా వేసిన గులకరాళ్ళును వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన పంచాయతీ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆదేశాలు ఉన్న ఆచరణ శూన్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఎంపీఓపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హాలియాలో స్థానిక ఎండీఓ కార్యాలయం ముందు సంవత్సరం నుండి పోరాటం చేస్తూ కోర్టు ఆదేశాలు తీసుకొచ్చిన బాట క్లియర్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీఓ విధానాలను నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చెన్ను గోవిందరెడ్డి, చెన్నూర్ అరుణల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. పంచాయతీ అధికారులు ముడుపులను ఆశిస్తూ న్యాయంగా పోరాడుతున్న వారికి పని చేయకుండా ఆక్రమణదారులకు మద్దతిస్తూ డీపీఓకు, డీఎల్పీఓకు తప్పుడు సమాచారం ఇస్తూ ఈ బాట పంచాయతీ పెద్దదిగా చేసిన పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శులపై తక్షణమే చర్యలు తీసుకొని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవతా సైదులు, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి, పద్మ, ధనమ్మ, సారమ్మ తదితరులున్నారు.