Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని 34, 35వ వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద వెంకటేశ్వర్లు, దైద రాజు అనుచరులు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సోమవారం ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే అభివృద్ధి లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని, బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మెన్ కుర్ర కోటేశ్వరరావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఉపాద్యక్షులు ఉబ్బపల్లీ మధుసూదన్, ఎస్సీ సెల్ అద్యక్షులు, మాజీ కౌన్సిలర్ దైద సోముసుందర్, ఉపాద్యక్షులు బాసాని గిరి, ఎండీ. షోయబ్, నల్లగంతుల నాగభూషణం, సర్పంచులు లావురి శ్రీను నాయక్, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, పిన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్, ఫయాజ్, శివ, దైద కృష్ణ, కందికంటి రమేశ్, కే.విష్ణు, డీ.రాందాస్, ఈట గిరి, కే.సైదులు, డీ.సైదులు, పీ.వెంకటేశ్వర్లు, కే.వెంకటేష్, ఆర్.రోహిత్, శశి, ఎ.విజరు, ఉబ్బపల్లీ రాజు, దాసరి సతీష్, డీ.నాగరాజు, ఉదయ్, డీ.ప్రణీత్, వీ.శ్రీను, ఆర్.సైదులు తదితరులు పాల్గొన్నారు.