Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 రోజులు రిమాండ్
- అరెస్టును ట్విట్టర్ వేదికగా ఖండించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-అనంతగిరి
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతగిరి పోలీసులు బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాసును అరెస్టు చేసిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి మండలం వెంకట్రాపురం గ్రామంలో గల డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన, విషగాలి ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ గత కొంతకాలంగా ఆ గ్రామస్తులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నిరసన కార్యక్రమాలు పరిగణలోకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈనెల 21వ న జిల్లా కలెక్టర్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పర్యటించిన సందర్భంలో డంపింగ్ యార్డ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం ఇప్పటికి ఇప్పుడు డంపింగ్ యార్డ్‌ను తరలించడం సాధ్యం కాదని అనువైన స్థలం లభించిన అనంతరం డంపింగ్ యార్డ్ తరలిస్తామని అప్పటివరకు ఏటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు చెబుతున్న సందర్భంలో పదేపదే ఎమ్మెల్యే ప్రసంగానికి గ్రామానికి చెందిన ఒకరు అడ్డుపడ్డారు. ఈ సమయంలో సదరు వ్యక్తిపై ఎమ్మెల్యే అసహనానికి గురై మాట్లాడిన మాటలను వీడియో చిత్రీకరించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే కోదాడ ఉద్యమ కెరటాలు అనే వాట్సప్ గ్రూపులో వినరు అనే వ్యక్తి వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోని ఉద్దేశిస్తూ అదే పార్టీకి చెందిన షర్మిల అనే మహిళ ఎమ్మెల్యే పై కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేపై అనుచిత వ్యక్తులు చేసినందుకుగాను వెంకట్రాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రేవుల కృష్ణ అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఇరువురిపై ఫిర్యాదు చేశారు. ఇరువురి పై కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలు గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న బీఎస్పి రాష్ట్ర ఈసీ నెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ చేయించారని ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఈసీ నెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్, బీఎస్పీ నాయకుల అరెస్టును ట్విట్టర్ వేదికగా బీఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అనంతరం కోర్టుకు తరలించడంతో కోర్టు 14 రోజులు రిమాండుకు పంపింది.