Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలను లక్ష్యంగా చేసుకొని డీజిల్ దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సంఘటన మంగళవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.యస్పీ రాజేంద్రప్రసాద్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ప్రకాశం జిల్లాలోని పుల్లలచెర్వు మండలం గంగవరంకు చెందిన లెక్కల పూర్ణయ్య,గుంటూర్ జిల్లాలోని ఈపూర్ మండలం ఎర్రగుంటకు చెందిన బానావత్ కృష్ణానాయక్, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం గుట్లపల్లికి చెందిన కునిశెట్టి మూశలయ్య 4, 5 రోజులుగా సూర్యాపేట జాతీయ రహదారి వెంట పక్కకు ఆగి ఉన్న లారీలను లక్ష్యంగా చేసుకొని వాటి పక్కన వీరి లారీని ఆపి వీరి లారీకి అమర్చి ఉన్న మోటార్ సహాయంతో డీజిల్ దొంగలిస్తున్నారు.ఇలా తీసుకున్న డీజిల్‌ను ప్రకాశం, గుంటూరు జిల్లాలోని వారి ప్రాంతాల్లో వ్యవసాయ దారులకు అమ్మి డబ్బులు సంపాదించుకుంటున్నారు.కాగా మంగళవారం స్థానిక ఖమ్మం ఎక్స్‌రోడ్డులో వాహనాల తనిఖీలో భాగంగా ఒక లారీని ఆపి చెక్ చేస్తుండగా లారీ డ్రైవరు సరైన సమాధానం చెప్పకుండా పారి పోవడానికి ప్రయత్నించడంతో అతనితో పాటు లారీలో ఉన్న ఇద్దర్ని కూడా విచారించారు.విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించారు.వారి నుండి 1500 లీటర్ల డీజిల్,మోటార్, ఒక పైపు,లారీ స్వాధీనం చేసుకున్నారు.వీరు 2016 నుండి ఇదే విధంగా అద్దంకి, సంతమగళూర్, పిడుగురాళ్ల, కేతేపల్లి ఏరియాలలో నేరాలు చేసి జైలుకు వెళ్లారు.ఈ కేసును ఛేదించిన సీఐ రాజశేఖర్, ఎస్సై క్రాంతి,ఎస్కె.యాకుబ్, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ, కర్నాకర్, కానిస్టేబుల్ సైదులు, ఆనంద్, మధులను ఎస్పీ అభినందించారు.