Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
మండలంలోని ఏపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి క్రీడలను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి హాజరై వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు.వారి ఆదేశాల మేరకు జనవరి 26న సూర్యాపేట నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్‌స్కూల్ నుండి 350 మంది విద్యార్థులు భాగస్వాములయ్యారన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కొణతం సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ దామిడిమంజుల శ్రీనివాస్, సర్పంచ్ రజితసుధాకర్, ఎంఈఓ ధారాసింగ్, ఉపసర్పంచ్ అవిరె పద్మ అప్పయ్య, నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బషీరుద్దీన్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు బ్రహ్మం, ఎంపీటీసీ,వెంకటరెడ్డి, విద్యా కమిటీ చైర్మెన్లు బందు మల్లయ్య, వరికుప్పల మధుసూదన్,కణాల మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి,జప్రాద్దీన్,ఉపాధ్యాయులు, వార్డుసభ్యులు పోకల మధుసూదన్,జ్యోతి పాపయ్య,దామిడి రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.