Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయం భారీగా ఉన్న మౌలిక వసతుల కల్పన శూన్యం
- వక్ఫ్‌బోర్డు పనితీరుపై మండిపడుతున్న నాయకులు, స్థానికులు
- ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న పోలీసులు
నవతెలంగాణ-పాలకీడు
ఈనెల 26 నుండి మూడు రోజులపాటు జరగనున్న పవిత్ర జాన్పాడు సైదన్న దర్గా ఉరుసు ఉత్సవాలకు, గత సంవత్సరం లాగానే అరకొర నిధులను కేటాయించి వక్స్ బోర్డ్ బాధ్యతను మరుస్తుంది. మరో 24 గంటల్లో తండోపతండాలుగా రానున్న భక్తులకు మౌలిక వసతుల కల్పనేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాలకు వక్స్బోర్డు నుంచి 20 లక్షలు తీసుకొస్తామని చెప్పిన అధికారులు ఊసరుమనిపించారు. కేవలం ఎనిమిదిన్నర లక్షల రూపాయలు మాత్రమే కేటాయించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. సీపీఐ(ఎం)మండల నాయకుడు అనంత ప్రకాష్ దర్గా ఉత్సవ ఏర్పాటను పరిశీలించి విస్తు పోయారు. సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని అర్జిస్తున్న వోక్స్ బోర్డ్ దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షకుపైగా రానున్న భక్తులకు కనీస సౌకర్యాలు అయిన నీటి వసతి, మహిళా భక్తులకు స్నాన నీటి ఘట్టాలు నిర్మించకపోవడం బాధాకరమన్నారు. 450 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న దర్గా నుండి కోట్ల రూపాయల ఆదాయాన్ని పిండుకుంటున్న వర్క్స్ బోర్డ్, ఆ డబ్బులు కొంత శాతం ఇక్కడ ఖర్చు చేసినా అనేక సమస్యలు తీరుతాయని సూచించారు. జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 25 లక్షల రూపాయలతో దర్గా విస్తరణ చేపట్టామని గుర్తు చేశారు. తర్వాత కాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇక్కడ జరగలేదని తెలిపారు. ఇప్పటికైనా ఇక్కడ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మంత్రి కేటీఆర్ దృష్టికి జాన్పాడుదర్గా సమస్యలను తీసుకుపోవడం పట్ల సీపీఐ(ఎం) మండల పార్టీ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వం దర్గాని అభివృద్ధి త్వరగా చేయించేలా చూడాలని కోరారు. మరోవైపు దర్గాలో భక్తులు పవిత్రంగా భావించే సిఫాయి భావి పరిసరాలు మురికి కూపంగా మారాయి. ఆ బావి నీటితో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు దూరమవుతాయనే భక్తులకు ప్రాగాడ నమ్మకం ఉంది. అక్కడ స్నానమాచరించడానికి కనీస సౌకర్యాలు లేవు. నామమాత్రంగా ఉన్న స్థానపు గదులకు, మరమ్మతులు, నిర్వహణ చేపట్టకపోవడం దురదృష్టకరం. మరోవైపు ఏర్పాట్లను స్థానిక ఎస్సై సైదులుగౌడ్ పరిశీలించారు. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ కేటాయించిన స్థలాలను పరిశీలించారు. నిర్వాహకులు భక్తుల దర్శనానికి ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి సూచనలను చేశారు. దామరచర్ల వైపు నుంచి, నేరేడుచర్ల, మఠం పెళ్లి నుండి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. స్థానికులు, భక్తులు రోడ్ల వెంబటి అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. భారీ జన సందోహం నేపథ్యంలో భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద, ప్రమాద హెచ్చరికలను భక్తులు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు.