Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 26న జిల్లా కేంద్రంలో జరిగే ట్రాక్టర్ర్యాలీలో రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళ చేసిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదని విమర్శించారు.రైతాంగం నిర్వహించిన పోరాటంలో మరణించిన కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎంఎస్స్వామినాథన్ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రి శ్రీరాములు, దండా వెంకట్రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు, పల్లె వెంకటరెడ్డి, పల్లా సుదర్శన్, దేవరంవెంకటరెడ్డి,గుమ్మడవెల్లి ఉప్పలయ్య, దుగ్గి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.