Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
క్రీడలు మానసికోల్లాసానికి పెంపొందించుకోవ డానికి దోహదపడ్తాయని జెడ్పీటీసీ భూక్యాసంజీవ్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి అన్నారు.(జి జె ఆర్ కప్ )గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఉన్నత పాఠశాలల నియోజకవర్గ స్థాయి కబడ్డీ, కోకో,వాలీబాల్ ఆటలపోటీలను సోమవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారు ప్రారంభించారు.అనంతరం విద్యార్థులతో కబడ్డీ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మిర్యాలపార్వతమ్మ గోవిందరెడ్డి,రాజుతండా సర్పంచ్ ధరావత్భద్రునాయక్, వివిధ గ్రామాల ప్రజాపతినిధులు, గ్రామపెద్దలు, జేజేఆర్ యూత్ సభ్యులు, పాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.