Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల అన్నారు. మంగళవారం బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని వెంపటి అంగన్వాడీ సెంటర్ను సందర్శించి బాలికల దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం,బాలికల విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవం లక్ష్యాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నాయని అన్నారు.ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు,సమానత్వం సాధ్యమని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ స్వరూపరాణి, వసంత, ఉమామహేశ్వరి, హెల్పర్స్ సుజాత, రజిత,రేణుక తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : నేటి సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా శక్తివంతంగా ఎదగాలంటే కుటుంబంతో పాటు వారికి విద్య నందిస్తున్న ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ అన్నారు.మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, ప్రత్యేకాధికారి నాగరాణి, ఉపాధ్యాయినిలు, విద్యారినులు పాల్గొన్నారు.
తిరుమలగిరి: సమాజంలో ఆడపిల్లలపై చిన్న చూపు ఉందని దీనిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మార్పు సొసైటీ సభ్యులు పోరెల్ల విప్లవ కుమార్ అన్నారు.మండల కంద్రంలో హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రంలో ఆయన మాట్లాడారు.అనంతరం కుట్టుమిషన్ కేంద్రంలో అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో రజిత, రేవతి, గంగ, సరిత, సంధ్యారాణి, దుర్గ, మౌనిక, పద్మ, హైమావతి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరుఎస్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.బాలికల విద్య సమాజం పాత్ర, బాలికల స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు, అనే అంశాల పై 8వ, 9వ, 10వ తరగతి , కాలేజీ విద్యార్ధులకు రాయించారు.అనంతరం కస్తూర్బాగాంధీ స్కూల్లో సమావేశం ఏర్పాటు చేసి గెలుపు పొందిన విద్యార్థులకు బహుమతులు, డిక్షనరీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సై యాదవేందర్రెడ్డి,తహసీల్దార్ హేమమాలిని, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మీ, కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ సరస్వతి,జెడ్పీహెచ్ఎస్ రఘు, ప్రాథమిక పాఠశాల నాగలక్ష్మీ, ఎంవీ ఫౌండేషన్ మండల ఇన్చార్జి వత్సవాయి లలిత, ఆర్గనైజర్ నాయిని సైదులు తదితరులు పాల్గొన్నారు.