Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులు, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత అందరిది
- జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి
- నకిలీ భూమి పత్రాలు సృష్టించి రూ.50 వేలకు అమ్మకం సభా దృష్టికి అధికార, ప్రతిపక్ష ఎంపీటీసీలు
- అధికారులు సమన్వయంతో పని చేయాలి
- ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండల వ్యాప్తంగా విద్యుత్, ఆర్ అండ్ బీ పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, రెవిన్యూ, వ్యవసాయశాఖ, మహిళా సమాఖ్య ఐసీడీఎస్ ఉపాధి హామీ, ఎక్సైజ్ శాఖలలో సమస్యల నిండి ఉన్నాయని మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష ఎంపీటీసీలు, సర్పంచులు సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చి సమస్యల తోరణంతో వాడి వేడిగా కొనసాగింది. మండలంలోని నార్కట్‌పల్లి బ్రాహ్మణ వెల్లంల అమ్మనబోలు ఏపీ లింగోటం, బాజకుంట, దాసరి గూడెం, చిన్న తుమ్మల గూడెం షేర్ బాయి గూడెం గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని విరిగిన స్తంభాలు ఇబ్బందికరంగా ఉన్నాయని స్తంభాలు వేసి తీగలు బిగించలేదని ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ను సమస్యలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అమ్మనబోలు గ్రామ లైన్మెన్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామం ఎంపీటీసీ కొంపెల్లి సైదులు సభా దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో 350 విద్యుత్ స్తంభాలు అవసరం ఉన్నాయని లో బడ్జెట్ తో అందుబాటులో లేవని పేర్కొన్నారు దీనిపై జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి స్పందిస్తూ మండలంలో ఉన్న విద్యుత్ సమస్యల పై పరిశీలించి అవసరం ఉన్న మేరకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు.
మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేందుకు గ్రామాల్లో ఉన్న సీసీ రోడ్లను తవ్వేశారు. తిరిగి ప్యాబ్ పనుల మరమ్మతులు చేయలేదని చాలా గ్రామాల్లో నీరు సరఫరా కావడం లేదని ఎంపీటీసీలు సర్పంచ్ లు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పైపులు లైన్ కోసం త్రవ్విన సిసి రోడ్ల మరమ్మతులు చేసిన అనంతరం ఎంబీ రికార్డు నమోదు చేయాలని ఆర్ డబ్ల్యు ఎస్‌ఏఈ అరుణ్ కుమార్‌కు ఆదేశించారు. మండల వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపులలో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని అమ్మనబోలు ఎంపిటిసి కొంపెల్లి సైదులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఫర్టిలైజర్ షాపులలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ ను ఆదేశించారు.
సమ భావన సంఘాలలో మహిళలు బ్యాంకు ద్వారా తీసుకుని మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా డబ్బులను చెల్లించినప్పటికీ చెల్లించలేదని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారని బ్రాహ్మణ వెల్లంల సర్పంచ్ మాధవి సభా దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వస్తున్న ఆరోపణలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సంఘాల వారిగ,రివ్యూ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని మహిళా సమాఖ్య ఏపిఎం శ్రీనివాస్ ను ఆదేశించారు . మండలంలోని నార్కట్‌పల్లి అమ్మనబోలు చెరువులలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని నార్కట్ పల్లి ఎంపిటిసి 3 పాశం శ్రీనివాస్ రెడ్డి, అమ్మనబోలు ఎంపీటీసీ సైదులు, నార్కట్ పల్లి ఎంపీటీసీ 2 పుల్లెంల ముత్తయ్య పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జడ్పీ చైర్మన్ ఎంపీపీ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఐబి శాఖలు సమన్వయంతో భూములను కాకుండా అన్యాక్రాంతం కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నకిలీ భూమి పత్రాలు సృష్టించి 50 వేల కు అమ్ముతున్నారు. నార్కట్‌పల్లి పట్టణంలో గల వైయస్సార్ కాలనీలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇంటి స్థలాలలో మిగిలి ఉన్న కాళీ ప్లాట్లలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించి 50 వేల రూపాయలకు అమ్ముతున్నారని నార్కట్ పల్లి ఎంపీటీసీ లు ముత్తయ్య, పాశం శ్రీనివాస్ రెడ్డి సభా దృష్టికి తీసుకొచ్చారు.
చెరువులు, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత అందరిది
జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్‌రెడ్డి
మండలంలో ప్రభుత్వ భూములు చెరువులు అన్యాక్రాంతానికి గురి కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి పేర్కొన్నారు. మండలం సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్ మాసం నుండి నేటి వరకు 15 వ ఆర్ధిక ప్రణాళిక ద్వారా రాష్ట్రాలకు వచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కక్ష సాధింపుగా యివ్వక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని ఆపాలని చ్షుస్తుందని అన్నారు. యావత్ దేశములో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం తప్ప మరో రాష్ట్రం లేదని అన్నారు. గతంలొ 15 ఫైనాన్స్ నిధులు రాష్ట్రం ప్రజా అవసరాలను దృష్టి లొ వుంచుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఆర్ధిక సంవత్సరం లొ చేపట్టె పనులకు ముందుగా ప్రతిపాదనలు పంపాలని,పంపిన పనులను తప్ప మరే యితర పనులు చేయకుండా అడ్డుకునే కుటిల యత్నం చేస్తుందని అన్నారు.మండలంలొ లిక్కర్, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సమయపాలన లేకుండా నిర్వహిస్తున్నారని, దీనిపై ఎక్సైజ్‌శాఖ కటినంగా వ్యవహరించి, వాటిని నియంత్రించాలన్నారు. అదే విధంగా మండలంలోని గ్రామాలలోని చెరువులు,ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురి కాకుండా ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.అదే విధంగా మండల కేంద్రంలో సొంత ఇల్లు లేని వారు చనిపోతే,అద్దెకు వున్న ఇంట్లో శవాన్ని పెట్టనీయక పోవడం వలన పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి తెలవగా 10 లక్షల రూపాయలు నార్కెట్‌పల్లి పట్టణంలొ పేద ప్రజలు శవాన్ని పెట్టుకోడానికి , దిన కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు భవన నిర్మాణానికి మంజూరు చేస్తానని అన్నారు . ఈ సర్వ సభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి తహసిల్దార్ ము రళీమోహన్ ఎంపీడీవో యాదగిరి, ,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు లు,వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి
మండలంలో ఉన్న సమస్య లను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజాప్రతినిధులు సూచించే సమస్యలను అధికారులు స్పందించి పరిష్కరించాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అధికారులు నిర్వహించే సమావేశాలకు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చి ప్రోటోకాల్ పాటించాలని అధికారులకు సూచించారు.