Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నాంపల్లి
పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ అన్నారు. పంచాయతీ కార్మికులు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు పెండింగ్ వేతనాలను చెల్లించాలని ధర్నా నిర్వహించి సూపరిండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మె చేయవలసి వస్తుందని హెచ్చరించారు. మండలంలో అనేక గ్రామపంచాయతీలో ఐదు నుండి 11 నెలల వరకు వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికులు అర్థాకళితో గడపాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. గ్రామపంచాయతీలో బడ్జెట్ లేదని, బడ్జెట్ వచ్చిన తర్వాత ఇతర అవసరాలకు వినియోగించడం దుర్మార్గమన్నారు. అదేవిధంగా ఆదివారం సెలవు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల, ప్రజాప్రతినిధుల వేధింపులు అరికట్టాలని, గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు సబ్బులు, మాస్కులు, శానిటైజర్ డ్రెస్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, కార్మికులు నాంపల్లి నరేష్, గంటల రవి, గాదెపాక మరియమ్మ, వంగూరు ఈరమ్మ, సులోచన, ఎల్లమ్మ, రాములమ్మ ,లక్ష్మయ్య, ఎల్లయ్య, రామచంద్రం, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ :గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీవో ఝాన్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షులు వట్టిపల్లి హనుమంతు, ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, ఊరు పక్క వెంకటయ్య, ఒంపు ముత్తమ్మ, ఆవుల ముత్తయ్య, మైలారం నరసింహ, సిరిసాల పోచమ్మ, గిరి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.