Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 30 లక్షల రూపాయలతో నూతనడ్రయినేజీ నిర్మాణ పనులకు, సీతారాంపురంలో రూ.8 లక్షలతో నూతన డ్రయినేజీ నిర్మాణ పనులకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అదే విధంగాపట్టణంలోని షాబునగర్‌లో 5 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నూతన వైకుంఠ ధామ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, ప్రజా ఆరోగ్యశాఖ ఎస్ఈ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, పట్టణ యువజన అద్యక్షులు, కౌన్సిలర్ షైక్ జావీద్, మలగం రమేశ్, సాదినేని స్రవంతి శ్రీనివాస్, వంగాల నిరంజన్‌రెడ్డి, ఇలియాస్, బంటు రమేశ్, పునాటి లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి శ్రీనివాస్, మాజీద్, మన్నెం లింగారెడ్డి, తిరుమలగిరి వజ్రం, వేముల దుర్గారావు, వింజం శ్రీధర్, తిరంశెట్టి కోటేశ్వర్రావు, మున్సిపల్ డీిఈ సాయిలక్ష్మి, కొట్టా ఆంజనేయులు, వింజం రాజేందర్, సుంకోజు మురళిచారి, జంజరాల నాగరాజు, యర్రబోతు సంజీవరెడ్డి, షేక్ ఫయాజ్, షైక్ నాగుల్ బాబా, అహ్మద్, షైక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.