Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవ తెలంగాణ-సూర్యాపేట
దేశంలో అధికారంలో ఉన్న మనువాద పాలకుల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంఘ: ఆధ్వర్యంలో గురువారం స్థానిక సుందరయ్య నగర్ లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశంలో దళితులు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంగా, అంటరాని వారిగా అనేక వివక్షలను ఎదుర్కొంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమే అనే భావనను నేటి మనువాద పాలకులు వ్యక్త పరచడం లేదన్నారు. కులాలు మతాల పేరుతో విభజించి ప్రజల మధ్య అల్లర్లు సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగం రూపొందించబడి దేశ ప్రజలకు ఆ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అమలు కావడం లేదన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం కేవీపీఎస్ అనేక పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. అలాంటి పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా బత్తుల వెంకన్న, మొకర్ల వెంకన్న, శ్రీనివాస్, లక్ష్మయ్య, దావీదు,కాంపాటి కిష్టయ్య, నవిలే వీరయ్య, రామతార, వాలి,పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.