Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జి షీట్ విడుదల
- డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి గుండెకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర చేపట్టనున్నట్లు డీసీసీ చెవిటి వెంకన్న యాదవ్ తెలిపారు.గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, కరపత్రాలు,పోస్టర్, విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26 న రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని జనవరి 30 తేదీన శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగరేసి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో తిరిగి విశ్వాసం కల్పించారని అన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రాహుల్ గాంధీ సందేశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు, హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కన్వీనర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేసారు.జనవరి 26న లాంఛనంగా ప్రారంభించి ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు నిర్విరామంగా యాత్ర జరగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతామని, ప్రతి వ్యక్తినీ కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై ఛార్జి షీటు విడుదల చేస్తామని తెలిపారు.ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా నిర్వహించే హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుదన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పీసీసీ ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్,పీసీసీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, ఓబీసీ సెల్ కో ఆర్డినేటర్ బెంజరపు రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, జిల్లా ఐ.ఎన్. టి.యు.సి వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు గుంటి సైదులు ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కాసా రంగయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు నాగుల వాసు, రుద్రంగి రవి, వెన్న మధుకర్ రెడ్డి, వల్దాస్ శ్రీను(రెబల్), పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత, రెడ్ హౌస్ ఇంచార్జీ గొట్టిముక్కుల నరేందర్ నాయుడు జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకన్న,అబూబకర్ సిద్ధిక్, పసుల అశోక్ యాదవ్, పేర్ల గిరి యాదవ్, శివ నాయక్,సాత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.