Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ-గరిడేపల్లి
ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తుందని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.15.50 లక్షల రూపాయలు వ్యయంతో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న డైనింగ్ హాల్ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురియైపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం మండలంలోని ఖుతుబ్ షాపురం (అగ్రహారం) గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఖుతుభ్షావలి దర్గా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే గ్రామాల్లో గతవారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సలిగంటి బిక్షమయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ పెండెం సుజాతశ్రీనివాస్గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రమీలవెంకటరమణారెడ్డి, సర్పంచ్ సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్న, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్, ఎంపీడీఓ వనిజ, తహసిల్దార్ కార్తీక్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.