Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గు రువారం మండలంలోని రవీంద్ర నాయక్ తండాలో రూ. 5 లక్షలతో చేప డుతున్న సీసీ రోడ్డు పనులకు శం కుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పిటిసి మారు పాకుల అరుణ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, పిఎసిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, సిరందాసు కృష్ణయ్య, టివిఎన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నేనావత్ గిమ్ల బల్లియ నాయక్, పాత లావత్ పద్మ దస్రు, ఎన్ని మాల నిర్మల ,నాగవరం ప్రభాకర్ రావు, రేణు గౌడ్, కృష్ణ, గోపాల్ ,పంచాయత్ రాజ్ ఏఈ శంకర్, తదితరులు పా ల్గొన్నారు.