Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రాజ్యాంగఫలాలు నేటికీ అందలేదని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1949లో రాజ్యాంగం వ్రాసుకున్నప్పటికి 1950లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని ఫలితాలు ప్రజలకు చేరక పోవటం చాలా శోచనీయమని, అమలు చేయని రాజ్యాంగాన్ని తగలబెట్టిన దానితో సమానమని ఎంతో ఆవేదనతో ఆనాడు అంబేద్కర్ వాపోయారని చెప్పారు. ఇప్పటికి రాజ్యాంగం అవతరించి ఏడు దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తూనే ఉన్నారన్నారు. ప్రజలందరికి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించిన భారత రాజ్యాంగం అంటే ఓ పుస్తకం మాత్రమే కాదు అది దేశానికి మార్గదర్శి, దిక్చూచి, అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వర్గాల భాద్యతన్నారు. రాజ్యాంగం గురించి సూక్తులు వల్లిస్తున్న ప్రస్తుత కేంద్ర బీజేపీ పాలకులు రాజ్యాంగ పీఠకను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగన్ని పరిరక్షించే మహౌన్నతమైన బాధ్యతను ప్రతి పౌరుడు కర్తవ్యంగా తీసుకోవాలన్నారు. దేశాన్ని మతోన్మాద ఫాశిస్ట్ శక్తుల నుండి కాపాడాలన్నారు. ట్రస్ట్ కార్య నిర్వాహక కార్యదర్శి నర్సిరెడ్డితో పాటు నారి ఐలయ్య, పీ.నాగార్జున, బండా శ్రీశైలం, సీహెచ్.లక్ష్మీనారాయణ, ప్రభావతి, సయ్యద్ హశం, పొట్టబత్తిని యాదగిరి, పీ.శంకర్, తుమ్మల పద్మ, భూతం అరణ, బీ.రవి పాల్గొన్నారు.