Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామంలో సీపీఐ(ఎం) అమరవీరులు పామనుగుల్ల జయమ్మ, ఏర్పుల లింగయ్యల స్మారకార్థం నిర్మించే నూతన భవన నిర్మాణ పనులను ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించారు. చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామంలో గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఆ గ్రామ సర్పంచ్ జనగాం రవీందర్, ఎంపీటీసీ మెంబర్ వడ్డెపల్లి లక్ష్మిపతి, పజ్జూరి అజరురెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టజీవులు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారన్నారు. ప్రజల కష్టాలను నిరంతరం పట్టించుకునే వారు కమ్యూనిస్టులే అని, ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా సీట్లు, ఓట్లు తగ్గినా పేదలకు కమ్యూనిస్టు పార్టీలు అవసరం అని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా వారు నమ్మిన సిద్దాంతం కోసం ఎర్రజండా పట్టి కడవరకు వదిలిపెట్టని వారని జయమ్మ, లింగయ్యల సేవలను కొనియాడారు. వారి స్మారకార్థం నిర్మించే నూతన భవన నిర్మాణ పనులకు అవసరమైన సహాయ సహకారం అందిస్తామని ముందుకు వచ్చిన గ్రామ సర్పంచ్ జనగాం రవీందర్, ఎంపీటీసీ మెంబరు వడ్డేపల్లి లక్ష్మిపతి, నాయకులు పజ్జూరి అజరురెడ్డిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, జిట్ట సరోజ, పామనుగుల్ల అచ్చాలు, పార్టీ మండల నాయకులు శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, నకిరేకంటి రాములు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కట్ట వెంకటేశం, కొమ్మనపల్లి గోపాల్, పామనుగుల్ల దశరథ,కంప మల్లయ్య, కోగూరు మారయ్య, ఏలం ఎల్లయ్య, చంద్రమౌళి, క్రిష్ణయ్య, పర్వతాలు, నర్సింహ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.