Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులు, సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అభివృద్ధి పనుల్లో భాగంగా పైలాన్ పార్కు, లింగోజిగూడెంలోని గోశాయి మఠంలోని మెట్ల బావిని సందర్శించి పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో ఆనందం విరాజిల్లుతుందన్నారు. అందుకు నిదర్శనం మునుగోడు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే సాక్ష్యాలన్నారు. ఇప్పటికే 70 కోట్ల పనులకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్తుశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, కోరగోని లింగస్వామి, నాయకులు పాశం సంజయ్‌బాబు, ఉడుగు మల్లేశంగౌడ్, తొర్పునూరి మల్లేశ్‌గౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, వల్లందాసు సతీశ్, బత్తుల స్వామిగౌడ్, పస్తం గంగరాములు, బొడిగె ఆనంద్‌గౌడ్, కట్కూరి కిరణ్ పాల్గొన్నారు.