Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
కేంద్రంలోని మతోన్మాద బీజేపీ శక్తులు రాజ్యాంగ హక్కులను తొలగించాలని చూస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పార్టీజిల్లా కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాయబడిన రాజ్యాంగం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేసీ ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను తొలగించాలని కుట్ర చేస్తుందన్నారు. లౌకికవాదం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయాలని బీజేపీి ప్రభుత్వం మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిని ఐక్య పోరాటాలతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోడ భాగ్య, ప్రజాసంఘాల నాయకులు ఎండి సలీం, వడ్డెబోయిన స్వప్న, ఈర్లపల్లి నర్సమ్మ, గడ్డం వాణి పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : రాజ్యాంగ పరిరక్షణ కోసం నేటి యువత, ప్రతి పౌరుడు ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అన్నారు. గురువారం పట్టణకేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఐటీయూ అనుబంధ హమాలీ కార్మిక సంఘం కార్యాలయం ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురిగాడి రమేష్, ఆ పార్టీ నాయకులు ఘనగాని మల్లేష్, డీివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్ ,మొరిగాడి అజరు, కటకం సుదర్శన్ , బజార్ హమాలీ నాయకులు అంగిరేకుల సత్యనారాయణ, గోపాల జగన్, బండ సిద్ధులు, చిమ్మి సుధాకర్, పుప్పాల నవీన్, సుంకరి బాలరాజు, రేగు బీరయ్య ,మంగ శ్రీను ,పోతు నరసింహ, గవ్వల మల్లేశం, చిమ్మి ప్రభాకర్, గొడుగు దాసు, కటకం సుదర్శన్, ఎర్ర రాజు ,వడ్డేమాన్ విప్లవ్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గురువారం 74వ గణతంత్ర దినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ డీఈ విశ్వేశ్వర్రావు, సీపీఐ(ఎం) మండల, పట్టణ కార్యాలయాల వద్ద కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా జాతీయ పతాకాలు ఎగురవేశారు. రాజీవ్ గాంధీ స్మారక భవనం ముందు డాక్టర్ రావుల మాధవరెడ్డి, వ్యవసాయ కార్యాలయం ముందు ఏఓ ముత్యాల నాగరాజు, బాలికల గురుకుల పాఠశాల ముందు ప్రిన్సిపాల్ సరోజనమ్మ, పశువైద్య కేంద్రం ముందు డాక్టర్ శ్రావణ్‌కుమార్ జాతీయ జెండాలు ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థల ముందు ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు జాతీయ పతాకాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.