Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి బట్టల మీద ఉన్న సోయి దేశ అభివృద్ధిపై లేదు
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- రామన్నపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, అందరి ఆశీస్సులు అందిస్తే మళ్లీ ఎమ్మెల్యే అయి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం మండలంలోని బాచుప్పల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 35 లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అంతకుముందు మండలంలోని సిరిపురం గ్రామంలో భద్రావతి కల్యాణ మహోత్సవానికి హాజరై దేవాలయ నిర్మాణానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నీర్నముల గ్రామాలలో గౌరీ సమేత చంద్రశేఖర స్వామి అగ్ని గుండాల కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాచుప్పల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఒక్క కృష్ణవేణి పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అతి స్వల్ప సమయంలోనే నియోజకవర్గ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని గ్రామాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు.దేశంలో పేద వర్గాల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు కేసీఆర్ మాత్రమే ఆయన తెలిపారు. దేశ ప్రధాని మోడీకి వస్త్రాలు, వేషధారణ మీదున్న సోయి దేశాభివృద్ధి మీద లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై బిజెపి ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, జడ్పిటిసి పున్న లక్ష్మి, ఎంపీపీ కే జ్యోతి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు గుత్తా నరసింహారెడ్డి, ఎడ్ల మహేందర్ రెడ్డి, మెట్టు మహేందర్ రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, ఉప్పు ప్రకాష్, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, దోమల సతీష్, గాదే పారిజాత, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, నాయకులు అంతటి రమేష్, బద్దుల రమేష్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.