Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఎన్సీసీ లో విద్యార్థులు శిక్షణ పొందడం ద్వారా వారి భవిష్యత్తు బాగుంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని అలవరచుకుని దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆర్మీ అధికారి సుబేదార్ మేజర్ సుహాస్ కదమ్, ప్రధానోపాధ్యాయులు ఎస్.నారాయణ అన్నారు. శనివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆలేరు, పోచన్నపేట ఉన్నత పాఠశాలలకు చెందిన క్యాడెట్లకు పదో ఎన్సీసీ వరంగల్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆర్మీ వింగ్ కి సంబంధించిన ఎన్సీసీి 'ఏ' సర్టిఫికెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఉత్తమ లక్షణాలు గలయువతను తయారు చేసేందుకు ఎన్సీసీి ఉపయోగ పడుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు శారీరక, రాత పరీక్షలో పరీక్షలు నిర్వహించారు.26 మంది బాలికలు, 43 మంది బాలురు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు దూడల వెంకటేష్, బాలారెడ్డి, పదవ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్, వరంగల్ అధికారులు హవల్దార్ విజరు బర్దార్ సీనియర్ క్యాడెట్లు ప్రణరు, పృథ్వి, మణి, వైష్ణవి, గాయత్రి, లావణ్య, భరత్, అనాస్ తదితరులు పాల్గొన్నారు.