Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు ఆడబిడ్డలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డ్డి అన్నారు. శనివారం పట్టణంలోని గొంగిడి నిలయంలో వంగపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ్ సింధు, గుర్రం అనూష ,జోగు ఝాన్సీ ,నీలం పూర్ణిమ ,ఏడవల్లి సింధు ,జోగు భవానిలకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు .ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వంగపల్లి ఉపసర్పంచ్ రేపాక స్వామి,మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షులు అచ్చిన కృష్ణ స్వామి,కార్యదర్శిలు గుర్రం శంకర్ ,నాయకులు గవ్వల సిద్ధులు,కానూరు సంధ్య ,బొట్టు రాజు ,ఏడవెల్లి గాయత్రి ,సిస చంద్రశేఖర్, కానుగు అనిల్ తదితరులు పాల్గొన్నారు.