Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి
నవతెలంగాణ-మోత్కూర్
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి అన్నారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో శనివారం వ్యవసాయ కార్మిక సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, కూలీల వలసలను నివారించి ఉపాధి భద్రత కోసం అనేక పోరాటాల ఫలితంగా 2005లో అప్పటి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం తెచ్చిందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తుందన్నారు. కేంద్రప్రభుత్వం కుట్రలు మాని కూలీలకు ఉపాధి కల్పించేలా వచ్చే బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గుండు వెంకటనర్సు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పిట్టల చంద్రయ్య, కార్యదర్శి మెతుకు అంజయ్య, నాయకులు కొంపెల్లి గంగయ్య, వెండి మాధవి, చందు తదితరులు పాల్గొన్నారు.