Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12గంటలైనా రాని అధికారులు
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12 దాటినా తహసీల్దార్, సిబ్బంది రాకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలేదని, నెలలతరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు తహసీల్దార్ కార్యాలయం పై దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేలా చూడాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
కలెక్టర్ ఆఫీసుకు వెళ్లాం
తహసీల్దార్ రామకృష్ణ
ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాను. తిరిగి మధ్యాహ్నం సమయంలో ఆలేరుకు వచ్చాను. మళ్లీ నాలుగు గంటలకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాను .తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఒకరో ఇద్దరు మినహాయించి అందరూ ఉన్నారు. ఆఫీస్ పని మీద కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాను రోజు 10 గంటల లోపే కార్యాలయంలో ఉంటున్నాను.