Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
వరికి తెగుళ్ల ఆశించడంతో దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రోగాల బారిన పడ్డ వరి చేలను శనివారం స్థానిక సీపీఐ(ఎం) నాయకులతో కలిసి మండలంలోని నాగంవారిగూడెంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన వరి పైరుకు తెగులు సోకి తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఇప్పటికే వరి సాగు ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ స్థితిలో ఎర్ర తెగులు, గొట్టం పురుగు ఆశించి ఎర్రగా మారి నాటు వేసిన వరిచనిపోతున్నదన్నారు. అధికారులు తగు సూచనలు ఇవ్వకపోవడంతో పురుగు మందుల అమ్మకం షాపు యజమానులు తమకు తోచిన విధంగా క్రిమిసంహారక మందులు రైతులకు కట్టబెడుతూ మరింత ఆర్థిక నష్టాలకు గురి చేస్తున్నారన్నారు.రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెగుళ్ల బారికి గురై నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఉచితంగా క్రిమిసంహారక మందులు సరఫరా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రై సంఘం గ్రామ అధ్యక్షులు జనగల యాదయ్య, ఉపాధ్యక్షులు బద్దం నర్సిరెడ్డి,రైతులు వెంపల్ల నర్సిరెడ్డి,గుత్త రాజేందర్రెడ్డి, ముక్కర్ల చంద్రయ్య,గుండు దశరథ,గుండు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.