Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
74వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో భువనగిరి పెద్ద చెరువు కట్ట పైన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకుండా అవమానపరిచ్చిన భువనగిరి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకుండా స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, భువనగిరి శాసనసభ్యుల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బి, నాగిరెడ్డికి నిన్నటి రోజునే షోకాస్ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రజాసంఘాల నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ వైఎస్సార్టిపి జిల్లా అధ్యక్షులు అతహార్ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ వడిచర్ల కృష్ణ యాదవ్ , పడిగెల ప్రదీప్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, పిట్టల బాలరాజ్ , పల్లెల యాదగిరి, నివాస్ అందే నరేష్ వసీం అక్రం మహేందర్ సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.