Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కోసం శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి సమావేశమై జిల్లాలో 27 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. బీదరిక నిర్మూలన, ఆరోగ్యవంతమైన గ్రామపంచాయతీలు, మహిళా సాధికారత, బాల బాలిక సహాయక కార్యక్రమాలు, సామాజిక భద్రత, గ్రామపంచాయతీ సుపరిపాలన, సురక్షిత తాగునీరు, పరిశుభ్రత పచ్చదనం, మౌలిక సదుపాయాల స్వాలంబన, తదితర 9 అంశాలకు సంబంధించి ఒక్కొక్క అంశంలో మూడు గ్రామ పంచాయతీల చొప్పున జిల్లాలో 27 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అడిషనల్ పిడి నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి పరిమళ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ పనులను పకడ్బందీగా నిర్వహించాలి
స్వచ్ఛ సర్వేక్షణ్ పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శనివారం నాడు ఆయన తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో సమావేశమై స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రనులను సమీక్షించారు. ఓడిఎఫ్ పనులకు సంబంధించి అన్ని డాకుమెంట్లను ఈనెల 31 లోగా అప్ లోడ్ చేయాలని తెలిపారు. 100 శాతం ఇంటింటి చెత్త సేకరించాలని, తడి చెత్త పొడి చెత్త నిర్వహణ చేపట్టాలని, ఇండ్లు, భవన నిర్మాణాల వ్యర్ధాల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని, ఇంటి వద్దే హౌమ్ కంపోస్టింగ్ నిర్వహించేందుకు ప్రజలను ప్రోత్సహించాలని ఆదేశించారు. భువనగిరి మున్సిపాలిటి 3 స్టార్ కోసం, మిగతా మున్సిపాలిటీలు వన్ స్టార్ కోసం అప్లై చేయాలని సూచించారు. స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు ఉత్తమ ప్రతిభ కనబరచి మంచి ర్యాంకింగ్ తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.