Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ -ఆలేరుటౌన్/ ఆలేరురూరల్
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఆలేరు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే గంధమల్ల రిజర్వాయర్ కోసం నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కోరారు. ఆ పార్టీ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గంధ మల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఆలేరు ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆలేరు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే గంధ మల్ల రిజర్వాయర్ పనులు చేపడతామని ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 8 ఏండ్లు గడిచిపోయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు గంధ మల్ల రిజర్వాయర్ కోసం తట్ట మట్టి తీయలేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా 2023 -24 బడ్జెట్లో రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ , మండల కార్యదర్శి ధూపటీ వెంకటేష్, సీఐటీయూ మండల కన్వీనర్ మొరిగాడి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, సూదగాని సత్య రాజయ్య , ఘనగాని మల్లేష్ ,నల్ల మాస తులసయ్య ,పిక్క గణేష్ ,డివైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి చెన్న రాజేష్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బోనగిరి గణేష్ ,డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు వడ్డేమాన్ విప్లవ్ , నాయకులు మొరిగాడి మహేష్ , మొరిగాడి అజరు, అశోక్ ,అంజయ్య ,మోడీ గాడి లక్ష్మణ్ ,కటకం సుదర్శన్, గొడుగు దాసు ,సంఘీ రాజు, ఎక్కాల దేవి, భాస్కర్, బొమ్మగంటి లక్ష్మీనారాయణ, చెక్క పరశురాములు నిడిగొండ వాలి, ఎర్ర రాజు,చౌడబోయిన యాదగిరి, ఐలయ్య పాల్గొన్నారు.