Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకరావాలని దాత, దాచారం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కర్నె వీరేశం కోరారు. మోత్కూరు మండలం దాచారం, పాటిమట్ల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు శనివారం ఆయన స్టడీ మెటీరియల్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఎంచుకుని దాని సాధన కోసం ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. దాచారం పాఠశాలకు గ్రామానికి చెందిన గంగుల రాములు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు రూ.25 వేల విలువ కలిగిన టీవీ అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు మన్నె అగ్గిరాములు, శ్రీనివాస్ రెడ్డి, టీచర్లు ఎం.లింగమల్లు, సిహెచ్.స్వప్న, బి.హన్మంతు, టి.ఉప్పలయ్య, జిల్లా కనకరత్నం, మేడబోయిన యాదగిరి, అన్నారం హరిబాబు, కురుమేటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.