Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతిమాటనూ సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో నిజం చేసి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేత కన్నుల పండువగా జరిగింది.నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు రూ.4.24 కోట్ల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తరహా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందన్నారు.మనమంతా ఆయనకు అండగా ఉండి అయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ఇప్పటివరకు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ కోసం ప్రభుత్వం రూ.85 కోట్ల నిధులు ఖర్చు చేసిందన్నారు. నియోజకవర్గంలో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు..2014కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాలలో కరెంట్, తాగు,సాగు నీరు, ఎలా వస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, వైస్‌ఎంపీపీ రామసానిి శ్రీనివాస్‌నాయుడు, మండల అధ్యక్షులు వంగాల శ్రీనివాసరెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.