Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తొలి తెలంగాణ ఉద్యమంలో కీర్తిశేషులు కన్మంతరెడ్డి నర్సింహారెడ్డి కీలకపాత్ర పోషించారని సూర్యాపేట 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మునగాల మండలం నేలమర్రి గ్రామంలో నర్సింహారెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో జిల్లాకు చెందిన ఉద్యమకారులు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని గుర్తు చేశారు.నాడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో వాటాలను కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరారు.ఈ సందర్భంగా ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ బచ్చలకూరి జార్జి, కో కన్వీనర్ మారేపల్లి పాపిరెడ్డి, నరసింహారెడ్డి కుమార్తె అపర్ణ, సోదరులు కన్మంత్రెడ్డి వెంకట్రాంరెడ్డి, సంఘం సహాయ కార్యదర్శి క సీతారాంరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు నీలకంఠం చలమంద, ప్రధాన కార్యదర్శి సీహెచ్ విజ్ఞేశ్వర్రావు, కోశాధికారి నరేంద్ర విద్యాసాగర్ రావు, ఉపాధ్యక్షులు ఉన్నం సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.