Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల రెడ్డి, వెలమ దొరల ఆధిపత్య పాలన పోయి, అణగారిన వర్గాల పాలన రావాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహరాజ్ ఆకాంక్షించారు.శనివారం సూర్యాపేట మండలకేంద్రం నుండి దురాజ్పల్లిమీదుగా ఇమాంపేట గ్రామానికి 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేరుకున్న సందర్భంగా డీఎస్పీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.తరతరాలుగా రాజకీయ బానిసలుగా బతుకుతున్న బీసీ, ఎస్పీ, ఎస్టీల పాలన అత్యవసరంగా రావాలన్నారు.అందుకోసమే 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టానని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో 10శాతం లేని మైనార్టీ వర్గాలైన, అగ్రకుల పాలనకు చరమగీతం పాడి, 90శాతం మెజార్టీగా ఉన్న అట్టడుగు వర్గాల రాజ్యం స్థాపిస్తామన్నారు.అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు.మన రాజ్యమేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ ఉచిత విద్యా ,వైద్యం, ఉపాధితో పాటు భూమి, ఇండ్లు సాధించుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్, ఇమాంపేట సర్పంచ్ పాములఉపేందర్, రమేష్, సైదులు, శ్రీనివాస్, బాలు, అంబేద్కర్, రాము, నరేష్, తదితరులు పాల్గొన్నారు.