Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మీ పిలుపునిచ్చారు.శనివారం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో స్థానిక 11వ వార్డు రాయినిగూడెంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది పేద ప్రజలు ఇండ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రన్నారు.అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టింది తప్ప నేటికీ లబ్దిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేయలేదన్నారు.ఇంటి స్థలం కలిగిన వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించి పేదలను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకన బోయిన సైదమ్మ, రైతుసంఘం జిల్లా కోశాధికారి కొప్పుల రజిత, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకులు నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.