Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
రాష్ట్రంలో ప్రయివేట్ ఎలక్ట్రికల్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రయివేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ జిల్లా ఉపాధ్యక్షులు మండాది సైదులు, మండల అధ్యక్షులు ప్రధాని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హుజూర్ణగర్లో జరిగిన తెలంగాణ ప్రయివేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ మూడవ ప్రాంతీయ మహాసభకు మండలం నుండి ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మందపాటి సైదారాజు, మండల ప్రధాన కార్యదర్శి మండాది సైదులు, కోశాధికారి మేకపోతుల నాగయ్య గౌడ్, సహాయ కార్యదర్శి బాజోజు తిరుపతచారి, గౌరవ అధ్యక్షులు పెండెం కాశయ్య గౌడ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.